జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు బూతుల వర్షం కురిపించారు. నిన్న శ్రీకాకుళంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సభకు పెద్ద ఎత్తున ప్రజలు , యువకులు , మహిళలు తరలివచ్చారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో మంత్రులు రోజా , అంబటి రాంబాబు, అమర్నాథ్ లను అదేపనిగా విమర్శించారు. దాంతో దానికి కౌంటర్ ఇచ్చారు ముగ్గురు మంత్రులు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని.
నేను రెండుసార్లు గెలిచాను. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ చేత తిట్లు తినాల్సి వస్తోంది ….. తూ….. పవన్ కళ్యాణ్ …… ప్యాకేజ్ కళ్యాణ్ అంటూ రోజా విమర్శించారు. ఇక అమర్నాథ్, అంబటి రాంబాబు , పేర్ని నాని కూడా దారుణమైన భాషలో తిట్టారు. ఆ మాటలను మీడియా రాయలేని పరిస్థితి లో ఉన్నాయంటే ఎంతగా విమర్శించారో అర్థం చేసుకోవచ్చు.