
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. ఈ విషయాన్ని ఉభయ కమ్యూనిస్ట్ నాయకులు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇటీవలే తిరుపతిలోని ఓ మహిళకు ఏకంగా 18 మంది భర్తలను సృష్టించి 18 దొంగ ఓట్లు సృష్టించారు. ఇక తాజాగా అదే తిరుపతిలోని 221 పోలింగ్ బూత్ లోగల 6-19-57-354 నెంబర్ గల ఇంటిలో మణి అనే వ్యక్తి పేరు మీద ఏకంగా 11 ఓట్లు నమోదయ్యాయి.
మణి పేరు మీద 11 సార్లు నమోదు కాగా 11 చోట్ల కూడా తండ్రి పేరును రకరకాల పేర్లను పొందుపరిచారు. ఇవన్నీ కూడా ఒకే పోలింగ్ బూతు కావడంతో కమ్యూనిస్ట్ నాయకులు వెలుగులోకి తీసుకొచారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఈ విషయాన్ని పట్టభద్రులు , అలాగే ఉపాధ్యాయులు గమనించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.