ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ ను నియమించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా మొత్తంగా 12 మంది గవర్నర్ లను నియమించగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను ఛత్తీస్ గడ్ గవర్నర్ గా నియమించింది కేంద్రం. ఆమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అబ్దుల్ నజీర్ ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పదవీ విరమణ చేశారు.