
సరిగ్గా అయిదేళ్ల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలోని మల్లపల్లిలో 340 కోట్ల వ్యయంతో అశోక్ లేలాండ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసాడు. 75 ఎకరాల విస్తీర్ణంలో ప్రతీ ఏటా 4800 వాహనాలను ఉత్పత్తి చేసేలా ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఇక ఈ పరిశ్రమలో సుమారుగా అయిదు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభించింది.
ఈ పరిశ్రమలో ఛాసిస్ మేకింగ్ తో పాటుగా బస్ బాడీ బిల్డింగ్ , కమర్షియల్ విద్యుత్ వాహనాలను కూడా తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థని నెలకొల్పడం గర్వకారణంగా ఉందన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె. దాసరి.
చంద్రబాబు హయాంలో ఏపీ కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. అయితే 2019 లో చంద్రబాబు అధికారం కోల్పోయాక ఏపీ నుండి పలు సంస్థలు వెళ్లిపోయాయి. కొత్తగా ఎలాంటి పరిశ్రమలు రాలేదు దాంతో టీడీపీ శ్రేణులతో పాటుగా సామాజిక కార్యకర్తలు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా ? అంటూ.






