శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద వడ్ల పూడి లోని సాయి బాబా ఆలయంలో అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమం డిసెంబర్ 22 న జరిగింది. ఈ పడిపూజలో పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వాములు , అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప భజన చేశారు స్వాములు. పూజా కార్యక్రమాల అనంతరం స్వాములందరు భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ , బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని UBlood ఫౌండర్ , చైర్మన్ డాక్టర్ జై యలమంచిలి , కృష్ణమూర్తి యలమంచిలి , రమేష్ బాబు యలమంచిలి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Breaking News