
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రీపోలింగ్‌కు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో తిరుపతి నగరంలో ప్రిసైడింగ్ అధికారులు 229 ( ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చిన్నబజారు వీధి), 233 ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణ పురం) పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్‌కు ఆదేశించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.