ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవ ను ఢిల్లీలో ఈడీ అరెస్ట్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం రాఘవను కోర్టులో హాజరు పరుచనుంది. లిక్కర్ స్కామ్ లో మాగుంట తనయుడు ఉన్నట్లుగా అప్పట్లోనే పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. అయితే మాకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. కట్ చేస్తే ఈడీ ఎంపీ తనయుడు మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసింది. దాంతో లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Breaking News