
మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. తనని అలాగే కొడుకు నారా లోకేష్ పై బూతుల వర్షం కురిపించే బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలి నాని ని ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో ఓడించాలని కంకణం కట్టుకున్నారట చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు మాత్రమే కాదు కమ్మ సామాజిక వర్గం మొత్యం కూడా కొడాలి నాని ని ఓడించాల్సిందే …… అందుకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.
అందులో భాగంగా గుడివాడ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు వెనిగండ్ల రాము ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీకి నిలిపేలా రంగం సిద్ధం చేశాడట చంద్రబాబు. అట్లాంటా లో స్థిరపడిన వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే అతడు ప్రేమించి పెళ్ళి చేసుకుంది మాత్రం దళిత వర్గానికి చెందిన యువతిని. పైగా ఆమె తండ్రి పాస్టర్ గా గుడివాడ ప్రాంతంలో పని చేస్తున్నాడు.
అంతేకాదు క్రిస్టియన్ వర్గాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో కమ్మ , దళిత ఓట్లతో పాటుగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా టీడీపీ కి అనుకూలంగా ఉంటుందని దాంతో కొడాలి నాని ఓడిపోవడం ఖాయమని లెక్కలు వేశారట. త్వరలోనే వెనిగండ్ల రాము ఇండియాకు రానున్నాడని టీడీపీ తరపున పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు.