
గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అడుగుపెడుతున్నాడు. చంద్రబాబు గుడివాడ పర్యటనకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. భారీ ర్యాలీని అలాగే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు టీడీపీ శ్రేణులు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు పై నారా లోకేష్ పై తీవ్ర పరుష పదజాలం వాడుతూ దారుణంగా విమర్శలు చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కొడాలి బూతుల వర్షం గురించి ఆ పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారు. దాంతో గుడివాడలో ఈసారి ఎలాగైనా సరే కొడాలి నానిని ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు చంద్రబాబు. అందుకే ఈరోజు గుడివాడలో పర్యటిస్తున్నాడు.
దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడలో కొడాలి నానిని ఉద్దేశించి ప్రసంగించడం , విస్మర్శించడం ఖాయం. దాంతో కొడాలి నాని తిరిగి భారీ స్థాయిలో కౌంటర్ ఇస్తాడు. దానికి తోడు టీడీపీ శ్రేణులు , వైసీపీ శ్రేణులు గుమికూడటం ఖాయం. ఇలా జరిగితే అనుకోని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు గుడివాడ పర్యటన వల్ల గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.






