
నిన్న దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత్ రాష్ట్ర సమితి గా మారుస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. దాంతో విమర్శలు, ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. కొంతమంది కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నారు …… అలాగే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
కాగా ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు నారా చంద్రబాబు దంపతులు. ఈ సందర్భంగా మీడియా కేసీఆర్ జాతీయ పార్టీ గురించి ప్రశ్నించింది. దాంతో ఆ ప్రశ్నకు చంద్రబాబు ఓ నవ్వు నవ్వి …. అదొక జాతీయ పార్టీ నేను స్పందించాలా ? అన్నట్లుగా వెళ్లిపోయారు.