కైకాల సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల కైకాల సత్యనారాయణ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటనలో ఉన్నాడు. అందువల్ల రాలేకపోయాడు. దాంతో ఈరోజు హైదరాబాద్ లోని సత్యనారాయణ ఇంటికి చేరుకొని సత్యనారాయణ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కైకాల సత్యనారాయణ నందమూరి తారకరామారావు కు అత్యంత సన్నిహితులు. అలాగే నారా చంద్రబాబు నాయుడుకు కూడా సన్నిహితుడు. దాంతో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున కైకాల సత్యనారాయణను పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కైకాల సత్యనారాయణ ఘనవిజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు. పార్లమెంట్ సభ్యుడు గా సేవలు అందించారు కైకాల సత్యనారాయణ. ఇక ఇటీవలే అనారోగ్యంతో సత్యనారాయణ మరణించడంతో ఈరోజు కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు.