
నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ . చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొనడానికి వెళ్ళాడు. ఇక అదే సమావేశానికి హాజరు కావాల్సిన ప్రధాని నరేంద్ర మోడీకి ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండటంతో అమిత్ షా మాత్రమే వచ్చాడు. అయితే ఈ కార్యక్రమంలో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు. అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు మెగాస్టార్ చిరంజీవి, చరణ్ ఇద్దరూ.
ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. గతకొంత కాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. బీజేపీలోకి చిరంజీవిని చేరేలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ నేను రాజకీయాలకు దూరం…… మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదని కుండబద్దలు కొట్టాడు. చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యాను అని అంటున్నాడు కానీ రాజకీయాలు మాత్రం అతడ్ని వదలడం లేదు……. వెంటాడుతూనే ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణ అమిత్ షాతో చిరు ప్రత్యేక భేటీ కావడమే.
అమిత్ షాతో చిరంజీవి భేటీ కావడంతో ఒక్కసారిగా స్పెక్యులేషన్స్ పెరిగాయి. చిరంజీవి బీజేపీకి మద్దతు ఇవ్వడమో లేక పార్టీలో చేరడమో ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీజేపీ బలపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.