23.3 C
India
Thursday, January 15, 2026
More

    సీఎం జగన్ బర్త్ డే వేడుకలను రోజా చక్కగా నిర్వహించింది : ఆలీ

    Date:

    CM jagan birthday celebrations grand success : ali
    CM jagan birthday celebrations grand success : ali

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె రోజా భారీఎత్తున సీయం జగన్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. విజయవాడలో జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా సినిమా పరిశ్రమకు చెందిన అనేకమంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.

    గతంలో రోజా జబర్దస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జబర్దస్‌ ఆర్టిస్ట్‌లతో ఉన్న పరిచయంతో రోజా వారందరిని విజయవాడకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌ కె రోజా ఎంతో కమిటెడ్‌గా నిర్వహించిన జగనన్న క్రీడా సంబరాల్లో విజేతలుగా నిలిచిన 300 మంది క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. వారు గెలుపొందిన ఫ్రైజ్‌మనీని ప్రముఖ నటులు ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారులు అలీతో చెక్కులను పంపిణీ చేశారు. వీరే కాకుండా ప్రముఖ నటి హోస్ట్‌ అనసూయ, హైపర్‌ ఆది, మహేశ్, చలాకి చంటి, అధిరే అభి, రాకేశ్, ఐశ్వర్యలతో పాటు తదితరులు పాల్గొని సభను విజయవంతం చేశారు.

    అలీ మాట్లాడుతూ–‘‘ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మంత్రి తన తోటి నటి అయిన రోజా గారి కమిట్‌మెంట్‌కి మేమందరం కదిలిపోయాం. ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్టేజ్‌కి వచ్చారు. ఈ రోజు జగన్‌ గారి పుట్టినరోజు వేడుకలు మా అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రోజా పెట్టిన ఎఫర్ట్‌కి తగినట్లుగా భారీ విజయాన్ని దక్కించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, డొక్కా మాణిక్య వరప్రపాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Police notices Ali: టాలీవుడ్ సీనియర్ నటుడు అలీకి పోలీసుల నోటీసులు.. కారణం ఇదే..!

    Police notices Ali: సరైన అనుమతులు లేకుండా తన తండ్రి పేరుపై...

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...