ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది గుంటూరు జిల్లా కోర్టు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో లక్కీ డ్రా అంటూ ప్రజల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని జనసేన నాయకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు జనసేన నాయకులు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు తక్షణమే మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.
Breaking News