నటసింహం నందమూరి బాలకృష్ణ పై ఏపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఆ పేరు తొలగించి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీ గా నామకరణం చేయడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక బాలయ్య కూడా తీవ్ర స్థాయిలో జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలం వాడారు.
బాలయ్య వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు అంబటి రాంబాబు , సీదరి అప్పలరాజు లతో పాటుగా పలువురు మంత్రులు బాలయ్యను జోకర్ తో పోల్చారు. అలాగే ఫ్లూట్ బాబు ముందు ఊదు ….. జగన్ అన్న ముందు కాదు అంటూ బాలయ్య డైలాగ్స్ నే తిప్పికొట్టారు. ఇక మరికొంతమంది మంత్రులు అయితే బాలయ్య పై మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
అంతేకాదు బాలయ్యకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ అయితే పునర్జన్మ నిచ్చింది వైఎస్సార్ అంటూ కావాలంటే ఆ రోజులను గుర్తు చేసుకో అంటూ బాలయ్య ఇంట్లో కాల్పుల సంఘటన ని గుర్తు చేసారు. అప్పట్లో బాలయ్య ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో బాలయ్య ఆసుపత్రికి అక్కడి నుండి కోర్టుకు వెళ్లి వచ్చాడు కానీ జైలుకు వెళ్ళలేదు …… అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాంతో అప్పటి సంఘటనను గుర్తు చేసుకో …… పునర్జన్మ ఇచ్చింది వైఎస్సార్ అంటూ గుర్తు చేస్తున్నారు ఏపీ మంత్రులు.