మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టింది వైజాగ్ కు చెందిన యువతి అమూల్య. పోలీసులైతే ఏం పీకుతారు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో ఏ ఎస్ ఐ సత్యనారాయణ ను బూతులు తిట్టడమే కాకుండా బీర్ బాటిల్ లో దాడి చేసింది. అయితే ఏ ఎస్ ఐ పై బీర్ బాటిల్ ను అమూల్య విసరగా అది గురి తప్పి పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడి కంటికి బలమైన గాయమైంది.
మద్యం మత్తులో ఉన్న అమూల్యను వైఎంసీఏ వద్ద నుండి వెళ్లిపోవాలని హితువు పలకడంతో రెచ్చిపోయిన అమూల్య ఏ ఎస్ ఐ సత్యనారాయణను బూతులు తిట్టడమే కాకుండా కాళ్లతో తన్నింది దాంతో ఆమెపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అమూల్య మద్యం తాగడమే కాకుండా గంజాయి కూడా సేవించిందని తెలిపారు పోలీసులు. వైజాగ్ లో అర్ధరాత్రి యువతి రచ్చ రచ్చ చేయడం సంచలనంగా మారింది.
విశాఖ బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద మద్యం, గంజాయి తాగిన మత్తులో యువతి వీరంగం. అద్దుకున్న పోలీసులపై బీర్ బాటిల్ విసిరి బూతులు తిట్టి, తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని వార్నింగ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/YT0vAAE2yt
— జన నేత్ర 👁️𝕍𝕀ℙ™ (@jana_netra) December 15, 2022