
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ పార్టీకి రాజీనామా చేసాడు.
కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసాడు . కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. దాంతో అప్పటి నుండి రాజకీయంగా సైలెంట్ అయ్యాడు. కట్ చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. రెండు మూడు రోజుల్లోనే బీజేపీ లో చేరడం ఖాయమని తెలుస్తోంది.