మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి , నెల్లూరు జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది …… నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేసాడు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. తెలుగుదేశం , కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆనం గతకొంత కాలంగా వైసీపీలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేలా వ్యాఖ్యాయించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నా ఫోన్ అలాగే నా పీఏ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు….. ఇది గత రెండేళ్లుగా సాగుతోంది. నన్ను వేధించాలని , సాధించాలని చూస్తున్నారు అయితే ఇప్పుడు ఏకంగా చంపాలని చూస్తున్నారు అంటూ జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతుండటం సంచలనంగా మారింది.