
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు వెండితెర రారాజుగా చరిత్ర సృష్టించారు. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనని ఇంతగా ఆదరించి అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని , తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించారు అన్న నందమూరి తారకరామారావు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. దాంతో 1983 జనవరి 9 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ప్రమాణ స్వీకారం చేసారు. అన్న నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 40 ఏళ్ళు పూర్తయ్యింది. దాంతో ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రారాజుగా నిలిచారు …… చరిత్ర సృష్టించారు.