మాజీ మంత్రి , మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ( 73 ) అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ చికిత్స పొందుతోంది. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం తిరుపతి లోని తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కుతూహలమ్మ మరణంతో ఆమె అనుచరుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్యారోగ్య శాఖా మంత్రి గా , మహిళా , శిశు సంక్షేమ శాఖ మంత్రి గా అలాగే డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుతూహలమ్మ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దాంతో ఇక రాజకీయాలకు దూరమైంది. కుతూహలమ్మ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.