నందమూరి తారకరామారావు మనవడు , నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి ల తనయుడు …… నందమూరి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ పుట్టినరోజు ఈరోజు దాంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు లోకేష్. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లోకేష్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. తన ప్రసంగంలో ఎక్కువగా తప్పులు దొర్లుతూ ఉండటంతో విమర్శలు వచ్చాయి. అయితే తన ఆకారం పై అలాగే మాట తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తనని తాను మలుచుకున్న తీరుకు నిజంగా అభినందనలు చెప్పాల్సిందే.
ఆకారంలోనే కాదు మాట తీరులో కూడా చాలా మెరుగు అయ్యాడు …….. పదునైన డైలాగ్స్ తో ప్రజలను , కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాడు. ఎమ్మెల్సీ గా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా ఎదిగాడు. అయితే ప్రజల ఆమోదం పొందాలంటే మరింతగా కష్టపడాల్సిందే. రాజకీయాల్లో తాత నందమూరి తారకరామారావు , తండ్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్న నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది JSW & Jaiswaraajya.tv .