
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నీరాజనం పలికారు ప్రజలు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరాడు. వారాహి వాహనంపై నిలుచున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తూ మచిలీపట్నంకు బయలుదేరాడు. దారి పొడవునా జనాలు పూల వర్షం కురించారు. జాతీయ జెండా చేతబట్టిన పవన్ యువతకు అభివాదం చేస్తుంటే తమ అభిమాన హీరోను , నాయకుడ్ని చూడటానికి పోటీ పడ్డారు అభిమానులు , జనాలు.
జనసేన పార్టీని ప్రారంభించి పదేళ్లు అవుతుండటంతో మలిచిపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. జనసేన సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ర్యాలీగా వస్తుంటే రహదారులు జనాలతో క్రిక్కిరిసిపోయాయి. 2014 మార్చి 14 న జనసేన అనే రాజకీయ పార్టీని ప్రకటించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు . అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ – బీజేపీ కి మద్దతు ఇచ్చాడు కానీ జనసేన తరుపున అభ్యర్థులను పోటీకి నిలపలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన తరుపున పెద్ద ఎత్తున అభ్యర్థులను నిలిపాడు ….. పవన్ రెండు చోట్లా పోటీ చేసాడు. కానీ రెండు చోట్లా పవన్ ఓడిపోయాడు. ఏపీలో 2024 లో అసెంబ్లీకి పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నందున జనసేన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో పడ్డాడు జనసేన అధినేత.