రాయలసీమకు అడ్డా …… కర్నూల్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. కర్నూల్ ప్రజలు చంద్రబాబు కు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు కర్నూల్ పర్యటన సమయాన్ని మించి రాత్రి అయినప్పటికీ అశేష జనవాహిని తరలిరావడంతో టీడీపీ శ్రేణులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఇంత పెద్ద స్థాయిలో వస్తారని ఊహించలేదు. వాళ్ళ అంచనాలను మించి జనాలు రావడంతో కర్నూల్ జనసంద్రమే అయ్యింది.
ఒక్క ఛాన్స్……. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకున్నాడు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీకి 2024 లో ఎన్నికలు జరుగనున్నాయి దాంతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను కోరడంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున అయితే స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు టీడీపీ శ్రేణులు.