
విజయనగరం జిల్లా బొబ్బిలిలో గర్జించాడు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభకు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన బాబు జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. నిన్న కడపలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దాంతో బొబ్బిలి సభలో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు బాబు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్లకు అండగా ఉంటాను…… వాళ్ళ కోసం ఎంతదూరమైనా వెళ్తాను……. పోరాటం చేస్తానన్నారు. ఇక తమ్మినేని సీతారాం పై కూడా విమర్శలు గుప్పించారు బాబు. విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ బాబు సభకు భారీగా జనాలు తరలి రావడంతో టీడీపీ శ్రేణులు చాలా సంతోషంగా ఉన్నారు.