
గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహం పై దుశ్చర్యకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు. దాంతో ఆ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. మహనీయులను గౌరవించుకునే సంస్కృతికి వైసీపీ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిందని , దాంతో నాయకుడికి తగ్గట్లుగానే ఆ పార్టీ క్యాడర్ కూడా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం పై దుశ్చర్యకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.