Pawankalyan ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇప్పుడు ఏపీలో ఇవి ప్రకపంనలు సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు వ్యూహంలో భాగమే అన్నట్లుగా కనిపిస్తున్నది. వలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కోపంగానే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వారికి దక్కాల్సిన గౌరవం వలంటీర్లకు మాత్రమే దక్కుతున్ని. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వలంటీర్లే అంతా తామై నడిపిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు వలంటీర్లపై తీవ్ర నమ్మకం పెట్టుకున్నారు. ఈ సమయంలో వలంటీర్ల వ్యవస్థపై అపనమ్మకం కలిగే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో వలంటీర్లలో జనసేన అంటే భయం కలిగేలా చేస్తున్నారు. ఇన్నాళ్లూ కేవలం వైసీపీ నేతలకే పరిమితమైన ఈ సేవలు ఇకపై జనసేన నాయకులతో తమకు ఇబ్బంది ఉంటుందని భయం కూడా వాళ్లలో కలిగేలా చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలో కి వస్తే తమకు ఇబ్బందులు కలుగుతాయని వారిలో ఇప్పుడే వారిలో ఓ సందేహాన్ని రేకెత్తించారు. దీంతో పాటు వలంటీర్ల వ్యవస్థపై వ్యతిరేకంగా ఉన్న వారందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు టీడీపీ కొంతకాలంగా పొత్తులంటూ తమకు కావాల్సిన సీట్లను జనసేనకు కేటాయించడం లేదనే టాక్ బయటకు వినిపిస్తున్నది. జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడం ద్వారా ఇప్పుడు జనసేనాని, చంద్రబాబుకు కూడా ఒక సవాల్ విసిరినట్లయ్యింది.
పవన్ ప్రసంగాలపైనే ఇప్పుడు ఏపీలో చర్చంతా జరుగుతున్నది. వారాహి మొదటి, రెండో విడుతల యాత్రలతో ఆయనకు వచ్చిన మైలేజ్ భారీ రేంజ్ లో పెరిగిపోయింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి జోష్ మరింత ఇచ్చేలా ఆయన యాత్ర ఆద్యంతం కొనసాగింది. ఇప్పుడు ఆయన వలంటీర్లను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అయితే పవన్ తాజా వ్యాఖ్యలు మాత్రం వైసీపీ, ప్రభుత్వం, పోలీసుల్లో మాత్రం ప్రకంపనలు రేపుతున్నాయి. దీనిపై ఫీడ్ బ్యాక్ ను ప్రభుత్వం కూడా నిఘా యంత్రాంగం ద్వారా తెలుసుకుంటున్నది. కొంతకాలంగా కనిపించకుండా పోయిన వివరాలు, లెక్కలను కూడా తెప్పించుకుంటున్నది. ఇదంతా పూర్తయ్యాకే ఒక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటివరకు తొందరపడవద్దని వైసీపీ పార్టీ నేతలకు ఆదేశాలున్నట్లు సమాచారం.