ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు గట్టిగా ఇచ్చి పడేసాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ” ఆ పార్టీ కాకపోతే ఈపార్టీ అనే చంద్రబాబులా కాదు” –
” ఈ భార్య కాకపోతే ఆ భార్య అనే దత్త పుత్రుడిలా కాదు ”
” నా స్టాండ్ ఇదే …… నా రాష్ట్రం ఇదే …… నా కుటుంబం ఇదే……. ఇక్కడే నా నివాసం ” అంటూ అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్ కు ఇచ్చి పడేసాడు.
తెలుగుదేశం పార్టీ స్థాపించింది చంద్రబాబు కాదు …… మామ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోకి ఎంటరై ఇప్పుడు ఏకంగా పార్టీనే సొంతం చేసుకున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే……. ఇకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దాంతో ఈ ఇద్దరిని ఇలా డైనమైట్ లాంటి మాటలతో టార్గెట్ చేసాడు జగన్.