
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఖాళీ స్థలాలను కబ్జా చేస్తోంది. ఏపీలో ఎక్కడ ఖాళీగా స్థలం కనిపించినా అక్కడ ఇది ప్రభుత్వ స్థలమని , ఆ స్థలంలో సచివాలయం కట్టబడును అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాంతో సదరు స్థలాల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక రాజమండ్రిలో అయితే పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.
దాంతో మండి పడుతున్నారు సదరు స్థలాల యజమానులు. ఆయా ఖాళీ స్థలాల మీద పన్ను బకాయిలు ఉంటె వసూల్ చేసుకోవచ్చు కానీ ఇలా ఏకంగా తమ స్థలాలను ప్రభుత్వ స్థలంగా ఎలా పరిగణిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక కొంతమంది ప్రజలను మేల్కొనేలా జాగ్రత్తలు చెబుతున్నారు. వీడియోలు చేసి అందరికీ పంపిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఖాళీగా స్థలం కనబడితే చాలు ఒకప్పుడు కబ్జాదారులు బోర్డ్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పని ఏకంగా జగన్ ప్రభుత్వం చేస్తుండటంతో ధైర్యం ఉన్నవాళ్లు ఎదురిస్తుండగా , ధైర్యం లేని వాళ్ళు , అండదండలు లేనివాళ్ళు మాత్రం అశక్తులుగా మిగిలి పోతున్నారు.