AP వచ్చే ఎన్నికల్లో జగన్‌ను పరిస్థితుల్లోనైనా గద్దెదించే యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని, ఎక్కువ పార్టీలను కలుపుకొని ప్రభుత్వంను ఏర్పాటు చేయకుండా చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ తో సహా ఆ పార్టీ నాయకులు తన పై వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
తనపై అభిమానం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరిని కూడగట్టుకొని ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు జనసేనాని.
వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారం నుంచి తప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు పవన్. దీని కోసం ప్రతిపక్ష పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఎప్పటి నుండో జనసేనతో పొత్తుకు టీడీపీ సమయం కోసం వేచి చూస్తోంది. దీని వల్ల జగన్ ప్రభుత్వంను కూలగొట్టడానికి టీడీపీకి కొంత ప్రయోజనం కలుగుతుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ ఏపీలో ప్రభుత్వంను ఏర్పాటు చేసుకొనే వీలుంది.
అయితే టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన ప్రజలలో విశ్వాసం పొందాలంటే కనీసం 50 స్థానాల్లో పోటీ చేసి గౌరవప్రదంగా ఉండాలని చూస్తుంది. ముఖ్యమంత్రిని డిసైడ్ చేయాలంటే కనీసం 50 సీట్లు కావాలి. అందుకే పవన్ ఆ దిశగా అడుగులు వేస్తన్నట్లు తెలుస్తోంది. కానీ టీడీపీ మాత్రం 50 సీట్లను జనసేను ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఏపీలో పొత్తులు ఎలా ఉంటాయోనని ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.