
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాకిచ్చింది జనసేన.ఆంద్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించడానికి కారణం జనసేన అని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తరుపున మాధవ్ పోటీ చేసాడు. అయితే జనసేన మాత్రం మాధవ్ కు మద్దతు తెలపకుండా టీడీపీ అభ్యర్థి అయిన చిరంజీవికి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది దాంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. బీజేపీ అభ్యర్థి మాధవ్ కు 10 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే నోటాకు 11వేలకు పైగా ఓట్లు రావడం గమనార్హం. అంటే ఏపీలో బీజేపీని ఎంతగా అసహ్యించుకుంటున్నారో ఈ సంఘటన రుజువు చేస్తోంది.
ఇక టీడీపీ అభ్యర్థి విజయంతో అటు వైసీపీకి ఇటు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లైంది. బీజేపీ – జనసేన మిత్రపక్షాలు. కానీ గతకొంత కాలంగా జనసేన బీజేపీతో అంటీముట్టనట్లుగానే ఉంటోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాడు. ఎందుకంటే వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే బీజేపీతో సాధ్యం కాదని డిసైడ్ అయిపోయాడు పవన్ అందుకే టీడీపీతో కలిసి పోటీ చేయాలని 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించాలని కసిగా ఉన్నాడు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయుధంగా మలుచుకున్నాడు పవన్.