బీజేపీకి షాక్ ఇచ్చి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నా జనసేన లోకి కాకుండా టీడీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపారని , ఆ చర్చల వల్ల జనసేన లోకి కాకుండా టీడీపీ లోకి వెళ్లాలనే సంచలన నిర్ణయానికి వచ్చాడట. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీడీపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో సమావేశం నిర్వహించారని , సమావేశంలో టీడీపీ లో చేరితేనే మంచిదనే సలహాలు వచ్చాయట. దాంతో ఈనెల 23 లేదా 24 న కన్నా పసుపు జెండా కప్పుకోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Breaking News