ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేసారు. రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ రాజీనామాను ఆమోదించారు. దాంతో కోన రఘుపతి స్థానంలో మరొకరిని నియమించనున్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కోన రఘుపతిని రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడంతో కోన రఘుపతి రాజీనామా చేసారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మూడున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు కోన రఘుపతి.