
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు భోగి పండగ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ప్రధాన రహదారిలో తెల్లవారు జామున భోగి మంటలు వేశారు. భోగి మంటలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక మంత్రి అంబటి రాంబాబు భోగి మంటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
డ్యాన్స్ చేస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేసాడు. మహిళలతో కలిసి మంత్రి అంబటి చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే …… చాలామంది హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు అంబటి రాంబాబు. ఇక చానల్ లలో బాబూ ఓ రాంబాబు ……. బాబూ ఓ రాంబాబు అనే పాటను వేసి మళ్లీ మళ్లీ ప్రసారం చేశారు.






