వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన ఏపీ మంత్రి రోజా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జగన్ ఎడమ కాలి చిటికెన వేలు కూడా నువ్వు పీకలేవు అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది.
నిన్న పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామస్థులతో సమావేశమైన సందర్భంగా జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ గా వైసీపీ నుండి పెద్ద ఎత్తున మంత్రులు , ఎమ్మెల్యేలు పవన్ ను టార్గెట్ చేస్తూ దారుణంగా విమర్శించారు.
ఇక రోజా వెరీ వెరీ స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడాలంటే రోజా ఏమాత్రం వెనకడుగు వేయదు. దాంతో మరోసారి రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ …… జగన్ ఎడమ కాలితో సమానం అన్నట్లుగా మాట్లాడింది.
దాంతో జనసేన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రోజా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవడమే లేదు. 2024 లో జగన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్.