నన్ను అరెస్ట్ చేస్తామని మీడియా వాళ్లకు లీకులు ఇవ్వడం కాదు ….. దమ్ముంటే ఎన్ కౌంటర్ చేయండి అంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతకొంత కాలంగా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పార్టీలో నాకు అవమానాలు ఎదురు అవుతున్నాయని , అవమానాలు పడుతూ పార్టీలో కొనసాగలేనని జగన్ కు ఝలక్ ఇచ్చాడు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు.
ఈరోజు మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి జగన్ ప్రభుత్వం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసాడు. నా గొంతు నొక్కాలని చూస్తున్నారు …… ఎన్ని కేసులు పెట్టినా నేను వెనక్కి తగ్గేది లేదు …… అన్నింటికీ సిద్దపడే ఉన్నాను ….. నా గొంతు నొక్కాలంటే ఎన్ కౌంటర్ ఒక్కటే మార్గం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. జార్జి ఫెర్నాండేజ్ లాంటి నాయకులను జైల్లో వేస్తే భారీ మెజారిటీతో గెలిపించిన దేశం ఇది ….. జైళ్లు , కేసులు నాకు కొత్త కాదు అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.