
జగన్ ప్రభుత్వం పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించాడు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతకొంత కాలంగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడమే కాకుండా తన ఫోన్ ను ఎలా ట్యాప్ చేస్తున్నారో ఆధారాలతో సహా వివరించాడు. దాంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
దాంతో ప్రభుత్వం ఇమేజ్ కాపాడుకోవడానికి ట్యాపింగ్ ఆరోపణలను ఖండించింది జగన్ ప్రభుత్వం. జగన్ మీద ప్రేమతోనే ఎన్ని అవమానాలు ఎదురైనా భరించానని, ఇక భరించే ఓపిక లేదని నన్ను అవమానించిన పార్టీలో ఉండను అంటూ కుండబద్దలు కొట్టాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.