సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్టార్ V ఎడ్యుకేషనల్ సొసైటీ – యు బ్లడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. రక్తదాన ఆవశ్యకతను అలాగే యు బ్లడ్ యాప్ ని జగదీష్ యలమంచిలి రూపొందించడానికి గల కారణాలను విశ్లేషించారు మాజీ జెడ్పీ చైర్మన్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం.
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవాళ్లు ప్రాణాపాయం నుండి కోలుకునే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతతో పాటుగా కళాశాల కార్యదర్శి వెంకటేష్ , ప్రసాద్, రామాంజనేయులు, రెడ్ క్రాస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.