
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యాడు. దాదాపు నాలుగు గంటల పాటు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డి పై పలు ప్రశ్నలు సంధించింది. అయితే అన్ని ప్రశ్నలకు కూడా ముక్తసరిగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కావాలనే నన్ను టార్గెట్ చేసింది అంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసు విచారించిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అవినాష్ రెడ్డిని విచారించండి కానీ అరెస్ట్ చేయొద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈరోజు సీబీఐ ఎదుట హాజరయ్యాడు. నాలుగు గంటల విచారణ తర్వాత విచారణ ముగియడంతో బయటకు వచ్చాడు అవినాష్ రెడ్డి.