హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఈ న్యూడ్ వీడియో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దాంతో స్పందించిన అధికార పక్షం ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూసింది. అసలైన వీడియో అయితే గోరంట్ల మాధవ్ పై కఠిన చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే ఫోరెన్సిక్ నివేదిక రానే వచ్చింది. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముందంటే ……. ఆ వీడియో ఫేక్ వీడియో అని. దాంతో గోరంట్ల మాధవ్ రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు. న్యూడ్ వీడియో వల్ల వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని , తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని భావించిన వాళ్లకు షాక్ తగిలింది. ఫేక్ అని భావించిన ప్రభుత్వం టీడీపీ నాయకులపై చర్యలకు సిద్ధం అవుతోంది.