
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాలు గెలవాల్సిందే అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే వల్లే వేస్తున్న విషయం తెలిసిందే. అయితే 175 అసెంబ్లీ స్థానాలు కాదు కనీసం 25 స్థానాలు కూడా గెలవలేవు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు. 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో సీఎం జగన్ 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అయితే 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామనే అతి నమ్మకం పక్కన పెట్టు వచ్చే ఎన్నికల్లో కనీసం 25 స్థానాలు కూడా గెలుచుకోలేవు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ అంతటా జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , తమ తీర్పు ను అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసాడు రఘురామ కృష్ణరాజు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి.