
నందమూరి బాలకృష్ణకు కృతఙ్ఞతలు తెలిపాడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ప్రత్యర్థి పార్టీల నాయకులైన బాలయ్య – విజయసాయి రెడ్డి ల ప్రస్తావన ఏంటి ? బాలయ్య కు విజయసాయి రెడ్డి కృతఙ్ఞతలు తెలపడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే …….. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి సమీప బంధువు విజయసాయి రెడ్డి. నందమూరి తారకరత్న – అలేఖ్యా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వాళ్ళ ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఆశీర్వదించాడట. ఇక బాలయ్యకు కుటుంబ సభ్యులంటే అమితమైన ప్రేమ అందునా తారకరత్న అంటే మరీనూ ఎందుకంటే తారకరత్న హీరోగా నిలదొక్కు కోవాలని బాలయ్య గట్టి ప్రయత్నాలే చేసాడు కానీ కుదరలేదు.
ఇక అసలు విషయానికి వస్తే ……….. ఇటీవల తారకరత్న కుప్పం పర్యటనలో ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురైన తారకరత్నకు మెరుగైన చికిత్స అందించి అక్కడి నుండి బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు చికిత్స అందుతోంది. ఇక తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అన్ని విషయాలు కూడా బాలయ్య దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. దాంతో తారకరత్న ను బాగా చూసుకుంటున్నందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపాడు విజయసాయి రెడ్డి. తారకరత్న ఆరోగ్యం మెరుగు పడుతోందని , కాకపోతే మెదడు కొంత భాగం వాపు వచ్చింది కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉందని , మొత్తానికి ప్రాణాపాయ పరిస్థితి నుండి తారకరత్న బయటపడ్డాడని అందుకు బాలయ్య కృషి ఎంతో ఉందని కొనియాడాడడు.