తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. దాంతో తెలుగుదేశం పార్టీ ఎన్నారై సింగపూర్ శాఖ ఓ పాటను రూపొందించింది. తెలుగుదేశం పార్టీ సింగపూర్ నాయకుడు శేషగిరిరావు వట్టి కుంట ఆధ్వర్యంలో ఈ పాట రూపొందించారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాట రూపొందించారు. ఇక ఈ పాటను శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. పాదయాత్ర పాటను చూసిన రాఘవేంద్రరావు శేషగిరిరావు ప్రభుతులను అభినందించారు.