MP Raghurama Raju వైసీపీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామ రాజు ఎప్పడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ, జగన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తుంటారు. అయితే అధికార పార్టీ కూడా రఘు రామను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టింది. గత మూడున్నరేండ్లుగా ఆయన సొంత పార్టీ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్పష్టం చేస్తున్నారు.
మరోసారి కూడా నర్సాపురం ఎంపీగానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన తాజాగా జై స్వరాజ్య్ టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సారి పొత్తు పార్టీల నుంచి తాను బరిలోకి దిగుతానని తెలిపారు. పరోక్షంగా జనసేన నుంచి బరిలోకి దిగుతానని రఘురామకృష్ణ రాజు చెప్పినట్లుగా అంతా భావిస్తున్నారు. ఈ సారి తమ కూటమికి 130 సీట్ల కు పైగా వస్తాయని రఘురామ కృష్ణ రాజు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇది జగన్ కు పెద్ద షాక్.
ముందునుంచీ రఘురామ వ్యవహారం జగన్ కు తలనొప్పిగా మారింది. ఆయన పలుమార్లు వైసీపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. లోక్ సభలో వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. రాష్ర్ట ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
వైసీపీ రాష్ర్టానికి సాధించింది ఏమీ లేదని ఆయన గతంలో నేరుగా విమర్శలు చేశారు. పోలవరాన్ని పక్కన పెట్టేసిందని, జగన్ తీరుతో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గతంలో విమర్శలు చేశారు. అందుకే పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ర్టం దివాళా స్థాయికి చేరుకోవడానికి జగన్ కారణమని తరచూ రఘురామ విమర్శిస్తుంటారు.