రాత్రికి రాత్రి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూ జీవో రావడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును మార్చేశారు. ఎన్టీఆర్ పేరు స్థానంలో డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా నామకరణం చేసారు. దాంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ అసెంబ్లీలో ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పక్షాల వాదప్రతివాదనలతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.
మెడికల్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయనకు హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాల్సి వచ్చిందని , ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులైన టీడీపీ వాళ్లకు ఈ విషయం మీద మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు.