ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి , శక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓ సాధారణ కుటుంబం నుండి భారతదేశం అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని అలంకరించడంతో ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటోంది భారతదేశం.
ఇక సాధారణ కుటుంబంలో జన్మించిన నందమూరి తారకరామారావు వెండితెర రారాజుగా ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందారు. అయితే వెండితెర పై రారాజుగా వెలుగొందుతున్న సమయంలో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆ సందర్భంలోనిదే ఈ ఫోటో.