హిమాలయాలనుండి విచ్చేసిన నాగ సాధువులు కృష్ణా నది తీరాన కొలువై ఉన్న శివాలయం లోని శివుడికి అభిషేకం చేశారు. నాగ సాధువులు కృష్ణా నది తీరానికి రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. శివుడికి నాగ సాధువులు చేసిన అభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం , రామినేని ధర్మ ప్రచారక్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.