
కందుకూరు ఘటనలో 8 మంది మరణించడం తనని తీవ్రంగా కలిచి వేసిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు వెన్నుదన్ను లాంటి వాళ్ళని , అలాంటి కార్యకర్తలు మరణించడం , మరికొందరు ఆసుపత్రి పాలవ్వడం దురదృష్టకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని , గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరు లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా ఆ షోలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దాంతో రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది.