
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో జనసేన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదలందరికీ ఇల్లు అనే పథకంలో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని , పేదలకు ఇల్లు ఇస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ వాస్తవానికి ఈ పథకం ప్రజలకు చేరలేదని దుయ్యబడుతోంది జనసేన. దాంతో నిజనిర్దారణ నిమిత్తం పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే విజయనగరం జిల్లా గుంకలాంలో ఈరోజు పర్యటించనున్నారు.