
ఒక కులాన్ని గద్దె ని ఎక్కించడానికి నేను లేను.
కులాల గురించి మాట్లాడటం నాకు నచ్చదు.
కులాల గురించి మాట్లాడానికి చచ్చి పోయేవాడిని
కులాల ఐక్యత సమాజానికి చాల అవసరం .
నేను ఏ కులం లో పుట్టాలో నా ఇష్టం కాదు.
నేను కాపు కులంలో పుట్టిన బాధ్యత వదిలి పారిపోలేదు.
కమ్మ , రెడ్డి కులాలను ద్వేహించకూడదని చెప్పేవాడిని .
నన్ను కులాన్ని అమ్మతున్నానని అంటుంటే బాదేస్తుంది.
కొంగకు పాయసం పెట్టినట్లుగా సంక్షేమ పతకాలు ఉన్నాయి.
తప్పుడు చట్టాలు చేసి గంగపుత్రులకు అన్యాయం చేసింది.
మూడు రోజుల పాటు పలు కులాల ప్రతినిధులను కలిశాను.
అందరు మార్పు కోరుకుంటున్నారు.
కాపులు, బిసి, ఎస్సీ లు ఇంత మంది ఉండి దేహి అంటున్నారు.
ఐక్యత లేకపోవటం వల్లే దేహీ ,దేహీ అంటు వెనక్కు పోతున్నారు.
ఒక్క కులం పెత్తనం ఏపిలో ఆగిపోవాలి.
అన్ని కులాలకు పాతినిద్యం రావాలంటే జనసేన అధికారం లోకి రావాలి.
గతంలో వెనుకబడిన కులాలు అని చెప్పుకోవడానికి అవమానంగా బాధపడేవారు.
నేడు వెనుక బడిన కులాలు కూడా ధైర్యం గా ముందుకు నడుస్తున్నారు.
అగ్రకులాలల్లోని పేదలకు నేను అండగా ఉంటాను.
మీ ఎమ్మెల్యే లు దోచుకోవడానికి వేల కోట్లు ఉన్నాయి.
పేద విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఇవ్వడానికి డబ్బులు లేవు.
యువత అంతా నాకు అండగా ఉండి అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలందరికి అండగా ఉంటా.
1000 కోట్లు కేసిఆర్ ప్యాకేజీ అని ప్రచారం చేస్తున్నారు.
నా చెప్పులు తెనాలి లో తయారైన నాటు చెప్పులు.
ఈ సారి ఇలాంటి ప్రచారాలు చేస్తే చెప్పు దెబ్బ గట్టగా పడుతుంది.
నేను చేసే సినిమా లకు రోజుకు రెండు కోట్లు.
నాకు డబ్బులు అంత అవసరమా.
పాలన మారాలి అని అందురు చెబుతారు.
అందురు దూకమనే వారే. దూకే వారు లేరు.
నేను దూకాను, కానీ మీరు నన్ను 2 చోట్ల ఓడించారు.
మీరు బిజేపి తో ఉన్నారు కాబట్టే మేం మీకు దూరంగా ఉన్నామని ముస్లిం అంటున్నారు.
నేను బిజేపి తో ఉండగా మీపై ఏదైనా దాడి జరిగితే నేని పొత్తు వదులుకుంటా.
ముస్లిం లు జగన్ ను నమ్ముతున్నారు.
డిల్లీ వెళ్లి జగన్ రెడ్డి ఏం చేస్తాడో నాకు తెలుసు.
డిల్లీ వెళ్లి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న జగన్ రెడ్డి ను
ముస్లిం సమాజం ఎందుకు అడగరు.
ముస్లిం సమాజం ఆలోచన చేసి మాకు సపోర్ట్ చేయండి.
రామతీర్థం లాంటి దేవాలయాలపై దాడి చేసిన వారిని ఇంత వరకు పట్టుకోలేదు.
దేవాలయాలపై దాడులను మేం శాంతి భద్రతల సమస్య గా చూస్తున్నాం.
అవినీతి చేస్తే మమ్మల్ని నిలదీసే పరిస్థితి మీకు కల్పిస్తాం.
మాకు అధికారం ఇవ్వండి .
సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చి మోసం చేశారు.
మీ జేబులో డబ్బు ఇవ్వడం లేదు.
ప్రభుత్వ సొమ్ము మీరు ధర్మకర్తలు మాత్రమే.
ప్రభుత్వ సొమ్ము అంతా మాదే అని దోచుకుంటున్నారు.
ఇసుక దోచుకున్నారు.
అభివృద్ధి లేదు. మీలో పరివర్తన ఎప్పుడు వస్తుంది.
మద్యపానం నిషేదం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటే ఎందుకు ప్రశ్నించారు.
మద్యం డబ్బు అంతా తిరిగి మిమ్మల్ని కోనేందుకు వాడతారు.
మీ విలువైన ఓటు రోజుకు అర్ద రూపాయికు అమ్ముకుంటున్నారు.
చదువుకున్న యువత , అపార్ట్మెంట్ లలో ఉంటే వారు కూడా ఓట్లు అమ్మకుంటే మార్పు ఎలా వస్తుంది.
అమరావతి కి అన్ని వేల ఎకరాలు వద్దని ఆనాడే చెప్పాను.
మూడు వేల ఎకరాలతో ప్రారంభించమని చెప్పాను.
నేడు రాజధాని లోని రాష్ట్రం గా రోడ్డున పడ్డాం .
క్రిమినల్ రాజకీయాలు పోవాలి.
బాధ్యత కలిగిన ప్రభుత్వం రావాలి.
నేను రెడ్డి కులానికి వ్యతిరేకం కాదు.
అన్ని పదవులు రెడ్డు కు ఇస్తే మిగతా కులాలు ఏం అనుకోవాలి.
ఒక్క కులానికి ఊడిగం చేసే విదానానికి జనసేన వ్యతిరేకం.
చేయలేని పనికి నేను అబద్దం చెప్పలేను.
మద్యపాన నిషేధం విషయం లో నేను నిజం చెప్పాను.
జగన్ రెడ్డి అబద్దం చెప్పి అధికారం లోకి వచ్చాడు.
వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గంజాయి పెరిగిపోయింది.
దేశ వ్యాప్తంగా గంజాయి ఏపి నుంచి వెళ్తుంది.
గంజాయి ని వైసిపి ఎమ్మెల్యే ప్రోత్సాహిస్తున్నారు.
ఏవి యువత గంజాయి మత్తు లో సాగుతుంది.
జనసేన అధికారంలోకి వస్తే గంజాయి సమూలంగా అరికడతాం.
గంజాయి మాఫీయా ను తొక్కు తీసి కూర్చెబెడతాం.
మగతనం ఏంటో భవిష్యత్తులో చూపిస్తాం.
మేం అధికారం లోకి వస్తే నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరికి పన్ను కట్టిస్తాం.
మేం ఎన్ని స్థానాలలో పోటీ చేయాలో మీకు చెప్పాలా.
మీరు ఏ స్దానం లో ఎవరూ పోటీ చేయాలో మేం అడుగుతున్నామా.
తోడలు కొట్టి వారి తోడలు చూల్చి కూర్చోబెడతాం.
ఏ పార్టీ ను తిట్టిన ప్రయోజనం లేదు.
మీరు మారితేనే మార్పు వస్తుంది.
కులాలు దాటి ఒక్కసారి మాకు అండగా నిలబడండి.
ఒక్క సారి మారి అవకాశం ఇవ్వండి.
నిమ్న కులాలు కోసం ఆలోచించి నేను . నేను పుట్టిన కాపు కులం కోసం ఎందుకు ఆలోచించను.
నా కులాన్ని గౌరవిస్తాను.
కాపు లకు సంఖ్య బలం ఉంది.
ఇతర కులాలను దగ్గరకు తీసుకుని పెద్దన్న పాత్ర పోషించాలి.
మీరు ఓట్లు వేయండి మీ కోరిక తీరుతుంది.
1964 నుంచి కాపు లు సీఎం కావాలని డిమాండ్ ఉంది.
మీలో ఐక్యత లేకపోవడం వల్లే మీ కోరిక తీరడం లేదు.
కాపులు అధికారంలోకి వచ్చిన బిసిలు, దళితులు, మైనారిటీ లను గుండెల్లో పెట్టుకుంటా.
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి.
కాపులు నాకు అవసరం లేదని జగన్ రెడ్డి చెప్పిన మీరు ఓట్లు ఎలా వేశారు.
కాపులు తప్పు చేసి కులం లో పుట్టిన నన్ను దూషిస్తున్నారు.
కాపు లలో ఐక్యత ఉంటే మిగిలిన కులాలు మీతో నడుస్తారు.
ఐక్యత లేకపోతే అరాచక శక్తులు రాజ్యమేలుతుంది.
10 ఏళ్లు పార్టీ ని నిలబెట్టాను.ఇంకా ఏం చేయాలి.
రోజుకు 2 కోట్లు సంపాదించే నాకు ఇంకా డబ్బులు ఎందుకు .
గ్లోబెల్ ప్రచారాలు నమ్మకండి.
ఏపి గ్లోబల్ట్స్ జనసేన గురించి తప్పుగా మాట్లాడితే హీనంగా పోతారు.
క్షేత్రస్దాయిలో జనసేన గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగితే ఒంటరిగా పోటీ చేస్తాం.
గజమాలలు కాదు. ఓట్లు వేయండి.
గుండెలు బాధికోవడం కాదు. గుండెల్లో ఉన్న ఓటు వేయండి.
కసాబ్ లాంటి తీవ్ర వాదాలు దాడులు చూసి కలత చెందాను.
దేశానికి బలమైన నేత కావాలని బలంగా కోరుకున్న.
మోడి లాంటి బలమైన నేత దేశానికి అవసరం.
2014 లో మోడి పిలిస్తేనే వెళ్లి బేషరత్ గా మద్దతు ఇచ్చాను.
మీ కోసం 2019 లో నేను బిజేపి ను వీడి బయటకు వచ్చాను.
మీరు నాకు అండగా లేరు.
బిజేపి వైసిపి కు సపోర్ట్ చేసింది. నేను ఒంటరి వాడినయ్యాను.
మీ కోసం నేను బయటకు వస్తే మీరు నాకు అండగా ఉండలేదు.
బిజేపి పెద్దలతో మేం వేసిన ప్లాన్ కు వేరే పార్టీ లేకుండా పోయోది.
అమరావతి కోసం మార్చ్ ఫాస్ట్ చెద్దామనీ డిల్లీ నేతలు ఒప్పుకున్నారు.
ఏమైందో ఏమో …ఇక్కడ కు రాగానే వెనక్కు తగ్గారు.
ఎన్ని సందర్భాలలో నేను బిజేపి కు అండగా ఉన్న.
నేను అడిగితే డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రవేట్ పరం నిలిపివేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ పని చేసే కార్మికులే ముందుకు రావడం లేదు.
మిమ్మల్ని నమ్మి ఎన్ని సార్లు మోడి తో నేను గొడవ పడాలి.
టిడిపి తో నేను పొత్తు గురించి చర్చ జరగలేదు.
మీరు ఓట్లు వేయకపోయిన పర్వలేదు. నన్ను శంకించకండి.
తెలంగాణా లో మద్దతు గా తిరగమన్న బిజేపి నేతలు నేను తెలంగాణ లో పోటీ చేస్తానంటే ఆంధ్రవాడివి అని బిజేపి నేతలు అన్నారు.
వచ్చే ఎన్నికలలో జనసేన బలి పశువు కాదు.
అసెంబ్లీ అడుగు పెడతాం.
నాకు పాటు మన నాయకులు అంతా అసెంబ్లీ కు వస్తారు.