కుప్పంలో టీడీపీ కార్యకర్తలు , నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. చంద్రబాబు కుప్పం పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో పలు విషాద సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో మొత్తం 11 మంది చనిపోవడంతో జగన్ ప్రభుత్వం సభలు , సమావేశాలు , ర్యాలీ లు , రోడ్ షోలపై పలు ఆంక్షలు విధిస్తూ బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని తీసుకొచ్చాడు దాంతో టీడీపీ నాయకులు , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు , నాయకులు కుప్పం చేరుకోవడంతో మధ్యలోనే వాళ్ళను అరెస్ట్ చేసారు. దాంతో కొంతమంది కాలి నడకన కుప్పం చేరుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ ఛార్జ్ వల్ల పలువురు కార్యకర్తలు , నాయకులు గాయపడ్డారు.